delhi: ఢిల్లీలో భారీ ఈదురుగాలులు, వర్షం .. కుప్పకూలిన వైసీపీ టెంట్లు!

  • స్తంభించిన జనజీవనం
  • ఏపీ భవన్ వద్ద కుప్పకూలిన వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు
  • ఏపీ భవన్ లోపలికి వెళ్లిన శిబిరంలోని ఎంపీలు, నాయకులు
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ ఈదురు గాలులు, దుమారం చెలరేగిన అనంతరం వర్షం కురిసింది. దీంతో, జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కాగా, ఏపీ భవన్ వద్ద  వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో, దీక్షా శిబిరంలోని వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏపీ భవన్ లోకి వెళ్లారు. ఏపీ భవన్ లోపల తమ దీక్షను వారు కొనసాగిస్తున్నారు.
delhi
ap bhavan
YSRCP

More Telugu News