Telugudesam: పార్లమెంటు చరిత్రలోనే తొలిసారి.. స్పీకర్ ఛాంబర్‌లో టీడీపీ ఎంపీల ఆందోళన

  • కాసేపట్లో ఎంపీలను బయటకు తీసుకురానున్న మార్షల్స్‌
  • తాళ్లతో అడ్డుకుంటోన్న టీడీపీ ఎంపీలు
  • టీడీపీ ఎంపీలతో సెక్రటరీ జనరల్ చర్చలు విఫలం
ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఛాంబర్‌లో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఇలా స్పీకర్ ఛాంబర్‌లో ఎంపీలు ఆందోళన చేయడం పార్లమెంటు చరిత్రలోనే ఇది తొలిసారి. స్పీకర్ ఛాంబర్ నుంచి టీడీపీ ఎంపీలను తరలించేందుకు సిబ్బంది రంగం సిద్ధం చేసుకుని మార్షల్స్‌ను పిలిపించారు. దీంతో తమ దగ్గరకు మార్షల్స్‌ రాకుండా ఎంపీలు తాళ్లతో అడ్డుకుంటూ ప్రతిఘటిస్తున్నారు. కాసేపట్లో ఎంపీలను మార్షల్స్ బయటకు తీసుకురానున్నారు. అంతకు ముందు టీడీపీ ఎంపీలతో సెక్రటరీ జనరల్ స్నేహలత, స్పీకర్ కార్యాలయ సిబ్బంది చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. 
Telugudesam
Lok Sabha

More Telugu News