rajanikanth: 'కాలా' రిలీజ్ డేట్ పై కొత్త టాక్!

  • రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
  • నిర్మాతగా హీరో ధనుష్ 
  • అభిమానుల నిరీక్షణ    
మాఫియా డాన్ గా రజనీకాంత్ ను మరో డిఫరెంట్ లుక్ తో చూపించడానికి దర్శకుడు రంజిత్ 'కాలా' సినిమాను రూపొందించాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ మధ్యనే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 27వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కావలసి వుంది. అయితే ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

 ప్రస్తుతం తమిళనాట కొనసాగుతోన్న 'సమ్మె' అందుకు కారణం. అందువలన ఈ సినిమా ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 27వ తేదీన కాకుండా, జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రజనీ అదే రోజున రావడం ఖాయమైతే, అప్పుడు ప్లాన్ చేసుకున్న సినిమాలవాళ్లు తమ విడుదల తేదీలను మార్చుకోవలసి ఉంటుంది. ఏదేవైనా రజనీ సినిమా విడుదల తేదీ వాయిదా పడటమనేది ఆయన అభిమానులను నిరాశకు గురిచేసే విషయమేనని చెప్పక తప్పదు.    
rajanikanth
dhanush

More Telugu News