జైల్లో సల్మాన్ ని కలిసిన నటి ప్రీతి జింటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైల్లో సల్మాన్ ని కలిసిన నటి ప్రీతి జింటా

  • జోథ్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి కారెక్కి వెళ్లిపోయిన ప్రీతి
  • సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియో
  • ప్రీతికి ధన్యవాదాలు తెలిపిన సల్మాన్ అభిమానులు
కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడ్డ బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ని నిన్న జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైల్లో ఉన్న సల్మాన్ ని బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఈరోజు కలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

సల్మాన్ ని కలిసేందుకు ప్రీతి జింటా వెళ్లిందన్న వార్తతో సల్లూ భాయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు. ‘ఇదే నిజమైన ఫ్రెండ్ షిప్’ అంటూ ప్రీతిని కొనియాడుతున్నారు. కాగా, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ’జానేమన్’, ’చోరీ చోరీ చుప్ కే చుప్ కే’ చిత్రాల్లో సల్మాన్ సరసన ప్రీతి జింటా నటించింది.
Salman Khan
preethi zintha
jodhpur

More Telugu News