పొగాకు ఉత్పత్తులపై మరింత భయంకరంగా కనిపించనున్న హెచ్చరిక చిత్రాలు... విడుదల చేసిన కేంద్రం!
- మరింత భయానకంగా హెచ్చరికల చిత్రాలు
- రెండు పిక్చర్స్ విడుదల
- ప్యాకెట్లపై టోల్ ఫ్రీ నంబర్ కూడా తప్పనిసరి
- కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు
ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్ పై ముద్రించాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.