జగన్ ను ఎదుర్కోలేకే.. బీజేపీని టీడీపీ టార్గెట్ చేసింది: విష్ణుకుమార్ రాజు
- అసెంబ్లీని టీడీపీ ఏక పక్షంగా నిర్వహిస్తోంది
- ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే, మైక్ కట్ చేస్తున్నారు
- ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని... తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే, చూస్తూ ఊరుకోబోమని విష్ణు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు మాట మార్చి, బీజేపీని విమర్శించడం సరికాదని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.