వైసీపీలో చేరనున్న కృష్ణా జిల్లా టీడీపీ నేత!
- పార్టీ మారనున్న వసంత కృష్ణప్రసాద్
- కొన్ని రోజుల నుంచి వైసీపీ నేతలతో మంతనాలు
- జగన్ సమక్షంలో పార్టీలో చేరికకు సన్నాహకాలు
1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు-2 స్థానం నుంచి ఆయనను రంగంలోకి దించాలని టీడీపీ భావించినప్పటికీ... కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో ఆయనకు నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తంగిరాల గెలుపుకు ఆయన కృషి చేశారు. తంగిరాల మరణించిన తర్వాత ఉప ఎన్నిక నుంచి ఆయనను దూరంగా ఉంచారు. ఆ తర్వాత పార్టీ పరంగా కూడా పెద్ద ప్రాధాన్యత దక్కలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను ఒకటి, రెండు సందర్భాల్లో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, వైసీపీలోకి చేరేందుకు ప్రస్తుతం ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది.