నిజాలు చెప్పినందుకు.. అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ!
- సిల్క్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉందన్న అమిత్
- మరోసారి నిజం మాట్లాడారన్న కాంగ్రెస్
- కాంగ్రెస్ కు మీరు స్టార్ క్యాంపెయినర్ అంటూ ట్వీట్లు
మరో బహిరంగసభలో ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేశారని చెప్పారు. మరో చోట ప్రసంగిస్తూ, సిల్క్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉందని అన్నారు. అమిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని... ఈ విషయాన్ని అమిత్ షా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. 'మా పార్టీకి మీరు స్టార్ క్యాంపెయినర్ గా మారుతున్నారని' ట్వీట్ చేశారు.