బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరో శింబు తండ్రి
- కర్ణాటకలో అధికారం కోసం తమిళనాడుకు అన్యాయం చేస్తోంది
- తమిళులంతా కలసి బీజేపీకి బుద్ధి చెప్పాలి
- అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకం కావాలి
తమిళనాడుకు కావేరీ జలాలను అందించకూడదని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేలా తమిళ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు వేర్వేరుగా ఆందోళనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని... అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమైతేనే ఫలితం దక్కుతుందని చెప్పారు. కావేరి కోసం ఎవరు ఆందోళన చేపట్టినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.