amaravati: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకు చేదు అనుభవం!

  • అమరావతిలో నిర్మాణాలు పరిశీలించిన ఏపీ ఎమ్మెల్యేలు 
  • విష్ణుకుమార్‌ రాజును అక్కడే వదిలి వెళ్లిన బస్సులు
  • తీవ్ర అసహనానికి గురైన విష్ణుకుమార్‌రాజు
  • సొంత వాహనం పిలిపించుకుని వెళ్లిపోయిన వైనం
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలంతా కలిసి బస్సుల్లో రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకు ఈ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. విష్ణుకుమార్‌ రాజు అక్కడి పలు భవనాల నిర్మాణాలను పరిశీలిస్తుండగానే అక్కడి నుంచి ఎమ్మెల్యేల బస్సులన్నీ వెళ్లిపోయాయి. దీంతో మిగతా ఎమ్మెల్యేలెవ్వరూ అక్కడ కనపడకపోవడంతో విష్ణు కుమార్‌ రాజు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక చేసేదేమీలేక ఫోన్ చేసి, సొంత వాహనం పిలిపించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.   
amaravati
BJP
vishnu kumar raju

More Telugu News