sommireddy chandramohan reddy: మోదీని నిలదీస్తే.... విజయసాయి రెడ్డికి ఎందుకు?: సోమిరెడ్డి

  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని సీఎం నిలదీస్తున్నారు
  • ముఖ్యమంత్రిపై విజయసాయి సభాహక్కుల నోటీసులివ్వడం విడ్డూరం
  • దేశాన్ని పాలించే హక్కును బీజేపీ కోల్పోతోంది
'రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని నిలదీస్తే బీజేపీకి లేని దురద.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎందుకు?' అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రిపై సభాహక్కుల నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు.

బీజేపీ దేశాన్ని పాలించే హక్కును కోల్పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. గందరగోళం నడుమ లోక్‌ సభ పదేపదే వాయిదా పడుతోందని, లోక్ సభనే నడపలేని వారు దేశాన్ని ఏమి పాలిస్తారని ఆయన బీజేపీని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలకు వివరించేందుకు సీఎం వెళ్లడం బీజేపీకి కనువిప్పు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
sommireddy chandramohan reddy
ncb
Chandrababu
Narendra Modi
Telugudesam
BJP

More Telugu News