allu arjun: తమిళ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ?

  • తమిళంలో అగ్రదర్శకుడిగా అట్లీ కుమార్ 
  • తెలుగు హీరోలపై దృష్టి 
  • తెరపైకి అల్లు అర్జున్ పేరు        
తమిళ అగ్రదర్శకులలో అట్లీ కుమార్ ఒకరుగా కనిపిస్తాడు. ఒక వైపున తమిళంలో స్టార్ హీరోలకు కథలు వినిపిస్తూనే, మరో వైపున ఆయన తెలుగు హీరోలపైన దృష్టి పెట్టాడు. త్వరలో తాను నేరుగా ఒక తెలుగు సినిమా చేయబోతున్నాననీ .. ఒక స్టార్ హీరోతో ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పాడు. దాంతో ఆ స్టార్ హీరో ఎవరా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచనలో లేరు. ఇక మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. చరణ్ .. అంతా కూడా రెండేసి సినిమాలను కమిటైపోయారు. అందువలన ఇప్పట్లో వీళ్లలో ఎవరితోనూ అట్లీ కుమార్ సినిమా చేసే పరిస్థితి లేదు. అందువలన అట్లీకుమార్ చేయనున్నది అల్లు అర్జున్ తోనే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తోన్న ' నా పేరు సూర్య' పూర్తికావొచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన ఏ దర్శకుడితోనూ కమిట్ కాలేదు. అందువలన అట్లీ కుమార్ హీరో అల్లు అర్జున్ అని చెప్పుకుంటున్నారు.
allu arjun
altlee kumar

More Telugu News