andhra jyothy: ప్రధానిపై రాతలను నిరసిస్తూ... ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ యత్నం

  • హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం
  • మోదీ వ్యక్తిత్వంపై రాస్తున్న కథనాలపై ఆగ్రహం
  • పలువురు కార్యకర్తల అరెస్ట్
హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రధాని మోదీ వ్యక్తిత్వం గురించి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు రాసిన విశ్లేషణలు ప్రచురితమవుతున్నాయి. ఈ కథనాలపై బీజేపీ మండిపడింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుని వచ్చేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
andhra jyothy
BJP
attack
Narendra Modi

More Telugu News