మనమంతా దక్షిణ భారతీయులం: పార్లమెంటులో అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ తో చంద్రబాబు
- మేము కేంద్ర ప్రభుత్వ అన్యాయంపై పోరాడుతున్నాం
- మనమంతా దక్షిణ భారతీయులం.. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండన్న బాబు
- అధిష్ఠానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామన్న వేణుగోపాల్
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్ఠానంతో భేటీ అయి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబుకు తెలిపారు.