Chandrababu: పార్లమెంటు మెట్లకు నమస్కరించి, లోపలకు వెళ్లిన చంద్రబాబు.. లోక్ సభను వాయిదా వేసిన స్పీకర్

  • గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన చంద్రబాబు
  • పార్లమెంటు లోపలకు అడుగుపెట్టిన సీఎం
  • విపక్ష ఫ్లోర్ లీడర్లతో చర్చలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటులో అడుగుపెట్టారు. పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే, ఆయన గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు మెట్లకు నమస్కరించి, లోపలకు ప్రవేశించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వారితో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నల్ల బ్యాడ్జీని ధరించారు.
మరోవైపు, లోక్ సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ వారు నినాదాలు చేశారు. దీంతో, సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
Chandrababu
parliament

More Telugu News