andria: అందాలను ఆరబోస్తేనే అవకాశాలు: ఆండ్రియా

  • అభినయం, వాచకం బాగుంటే అవకాశాలు వస్తాయనుకుంటారు
  • గ్లామర్ కి అర్ధం మార్చేశారు
  • స్టార్ హీరోలే తప్ప హీరోయిన్లు ఉండడం లేదు
సినిమాలలో ఎంత ఎక్కువగా అందాలను ఆరబోస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయని కోలీవుడ్ నటి ఆండ్రియా తెలిపింది. సినీ పరిశ్రమకు వచ్చే యువతులు అనడంతో పాటు అభినయం, వాచకం బాగుంటే అవకాశాలు వస్తాయని భావిస్తారని, కానీ వాస్తవానికి ఇక్కడ అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఎక్కువని తెలిపింది.

 ప్రస్తుతం గ్లామర్‌ కి అర్థం మార్చేస్తున్నారని, అవసరం ఉన్నా లేకపోయినా బికినీలు వేయడం, సీన్‌ డిమాండ్‌ చేస్తోందనీ, అరకొరా దుస్తులు వేసుకోవడం, లిప్‌ లాక్‌ సీన్స్ పెట్టడమే గ్లామర్ గా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్లను కేవలం అందాల బొమ్మలుగానే చూపిస్తున్నారని, వారి నటనను చూపించడం లేదని వాపోయింది.

దీంతో చాలా మంది రాజీ పడిపోతున్నారని చెప్పింది. అందుకే చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలే తప్ప స్టార్ హీరోయిన్ లు ఉండడం లేదని పేర్కొంది. కోలీవుడ్ లో నయనతార ఒక్కరే స్టార్ హీరోయిన్ అని ఆండ్రియా తెలిపింది. ఆమెలా తనకు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు ఇస్తే నిరూపించుకోగలనని చెప్పింది. 
andria
kollywood
actress

More Telugu News