Payyavula Keshav: మాజీ ఎమ్మెల్యే పయ్యావుల వెంకట నారాయణప్ప కన్నుమూత

  • టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ తండ్రి వెంకట నారాయణప్ప
  • అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి
  • అనంతపురం బయలుదేరిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ తండ్రి పయ్యావుల వెంకట నారాయణప్ప (83) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. తన తండ్రి కన్ను మూశారని తెలుసుకున్న పయ్యావుల కేశవ్‌ అమరావతి నుంచి బయలుదేరి అనంతపురం వెళ్లారు.

పయ్యావుల వెంకట నారాయణ కూడా రాజకీయ నాయకుడే. గతంలో ఆయన రాయదుర్గం నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై సేవలందించారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సంతాపం తెలిపారు. 
Payyavula Keshav
father
passed away

More Telugu News