Jagan: మోదీని మాత్రం జగన్ విమర్శించడం లేదు: ఢిల్లీ పర్యటనకు ముందు తమ నేతలతో చంద్రబాబు

  • రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు
  • తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
  • జగన్‌పై విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పలు పార్టీల నేతలతో ఆయన చర్చలు జరిపి రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై వివరించడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయి, తన పర్యటనకు సంబంధించిన వివరాలపై వారికి స్పష్టత ఇస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళుతున్నానని చంద్రబాబు తమ నేతలతో అన్నారు. ప్రధాని మోదీని మాత్రం వైసీపీ అధినేత జగన్ విమర్శించట్లేదని, సొంత ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై మోదీని ప్రశ్నించకుండా, తన కేసుల నుంచి బయటపడడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 
Jagan
New Delhi
Chandrababu

More Telugu News