Bharath Ane Nenu: ఊపేస్తున్న 'భరత్ అనే నేను' రెండో పాట!

  • ఈ ఉదయం 10 గంటలకు విడుదలైన రెండో పాట
  • 'ఐ డోంట్ నో...' అంటూ సాగే పాట
  • పాడిన ఫర్హాన్ అక్తర్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' రెండో పాట ఈ ఉదయం 10 గంటలకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల కాగా, నిమిషాల్లోనే వైరల్ అయింది. చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కోరిక మేరకు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాట పాడగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగం చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా, యూ ట్యూబ్ లో అది సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక 'ఐ డోంట్ నో...' అంటూ సాగే ఈ పాటను ప్రస్తుతం పిన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాటను మీరూ వినండి.

More Telugu News

Bharath Ane Nenu
Mahesh Babu
Second Song