Actress Kusbhu: వాజ్‌పేయిపై నటి ఖుష్బూ ప్రశంసల జల్లు

  • వాజ్‌పేయి గొప్ప పాలనాదక్షుడు
  • ఒక దేశం...ఒక మతం సిద్ధాంతాన్ని ప్రోత్సహించలేదు
  • 'కర్ణాటక పంచాయత్' కార్యక్రమంలో ఖుష్బూ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన గొప్ప నేతగానే కాక పాలనాదక్షుడుగా కూడా అందరికీ ఆదర్శప్రాయుడని ఆమె కొనియాడారు. 'ఇండియా టుడే' సంస్థ ఈ రోజు బెంగళూరులో నిర్వహించిన 'కర్ణాటక పంచాయత్' చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.

"వాజ్‌పేయి దూరదృష్టి ఉన్న గొప్ప నేత. చరిత్రలోని గొప్ప పాలకుల్లో ఆయన కూడా ఒకరని కాంగ్రెస్ సైతం భావిస్తోంది. ఆయన పాలనలో గోరక్ష దాడులు జరగనేలేదు. ఆయన 'ఒక దేశం..ఒక మతం' సిద్ధాంతాన్ని కూడా ప్రోత్సహించలేదు. కానీ నేడు దేశంలో పరిస్థితులు మారిపోయాయి. 'ఒక దేశం..ఒక మతం' పేరుతో బీజేపీ చెలరేగిపోతోంది" అని ఖుష్బూ ఈ సందర్భంగా కాషాయ పార్టీ లక్ష్యంగా విరుచుకుపడిపోయారు.
Actress Kusbhu
Vajpayee
BJP

More Telugu News