Chandrababu: మోదీపై మరోసారి మండిపడ్డ చంద్రబాబు

  • ఏపీకి మోదీ తీరని అన్యాయం చేశారు
  • మోదీపై ప్రతి ఒక్కరూ పోరాడాలి
  • అమరావతి, పోలవరంలను పూర్తి చేసి చూపిస్తా
ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ కు మోదీ తీరని అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పొట్టకొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మోదీ అనైతిక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు.  ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అన్నివిధాలా సహాయ నిరాకరణ చేస్తోందని మండిపడ్డారు.

ఏపీలో 'ఏ' అంటే అమరావతి, 'పీ' అంటే పోలవరం అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. ఈ రెండింటినీ పూర్తి చేసి చూపిస్తానని అన్నారు. భావితరాల కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే... తనపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. తెలుగు జాతికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. 
Chandrababu
amaravathi
polavaram
Narendra Modi

More Telugu News