ఎయిర్ హోస్టెస్ వస్త్రాలు ఊడదీయించి మరీ సెక్యూరిటీ చెక్... స్పైస్ జెట్ విమానయాన సంస్థలో కలకలం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ హోస్టెస్ వస్త్రాలు ఊడదీయించి మరీ సెక్యూరిటీ చెక్... స్పైస్ జెట్ విమానయాన సంస్థలో కలకలం

  • చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం జరిగిన ఘటన
  • ఓ ఎయిర్ హోస్టెట్ శానిటరీ ప్యాడ్లు కూడా తీసేయించిన సెక్యూరిటీ
  • చోరీ అనుమానంతో శరీరమంతటా శోధన
ప్రైవేటు చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ లో కలకలం రేగింది. సంస్థకు చెందిన సెక్యూరిటీ సిబ్బందే ఎయిర్ హోస్టెస్ ల వంటిపై నూలు పోగు లేకుండా విప్పించేసి మరీ తనిఖీలు చేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధమైన ట్రీట్ మెంట్ ను ఓ ఎయిర్ హోస్టెస్ బయటపెట్టింది. చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విధులకు హాజరయ్యే సమయంలోను, విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలోనూ విధిగా తనిఖీలు చేయడం సాధారణంగా జరిగేదే. అయితే, మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఓ ఎయిర్ హోస్టెస్ ను ఈ ఉదయం వంటిపై వస్త్రాలు తీయించేసి తనిఖీ చేశారు. ఆమె రుతు క్రమ సమయం కావడంతో శానిటరీ ప్యాడ్స్ ధరించి ఉంది. అయితే, వాటిని కూడా తీసేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించారు. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ సమయంలో తనను అసంబద్ధంగా తాకినట్టు బాధితురాలు మీడియాకు తెలిపారు. గత మూడు రోజులుగా ఇదే విధంగా బట్టలు విప్పించేసి తనిఖీలు చేస్తున్నట్టు బయట పెట్టింది.

అయితే, స్పైస్ జెట్ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కొందరు క్యాబిన్ క్రూ సిబ్బంది విమానాల్లోని మెటీరియల్ ను తమ వెంట తీసుకెళ్లిపోతున్నట్టు పేర్కొంది. అందుకే చాలా కఠినంగా తనిఖీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
SPICEJET
air hostess

More Telugu News