అనుష్క శర్మ నిర్మాణంలో మరో 'మూడు...!'
- అనుష్క శర్మ బ్యానర్లో మరో మూడు చిత్రాలు
- గత చిత్రాల మాదిరిగానే విభిన్న కథాంశాలతో రూపకల్పన
- యువ టాలెంట్‌కు అవకాశం
తన గత చిత్రాల మాదిరిగానే ఇవి కూడా విభిన్న కథాంశాలతో తెరకెక్కనున్నాయి. ఈ సారి కూడా ఆమె యువ నటీనటులకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆమె నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సంజయ్ దత్ బయోపిక్, వరుణ్ థావన్ సరసన చేస్తున్న మరో చిత్రం, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'జీరో' చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.