Jagan: జగన్ .. నీ దళారి విజయసాయిరెడ్డిని బూట్లు నాకేందుకా రాజ్యసభకు పంపింది? : మంత్రి దేవినేని

  • ఈ దళారీ పనులు ప్రజలకు తెలియవనుకుంటున్నావా?
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారు?
  • మీ రాజీనామా డ్రామాల విషయం ప్రజలకు తెలుసు
ఏపీకి న్యాయం చేసేందుకంటూ వైసీపీ రాజీనామాల డ్రామా ఆడుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రాణాలకు తెగించి మరీ సమైక్యాంధ్ర ఉద్యమం చేశామని, నాటి ప్రధాని, సోనియా నివాసాల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశామని అన్నారు.

‘జగన్ నువ్వేమి చేశావు? నీ దళారి విజయసాయిరెడ్డి బూట్లు నాకుతున్నాడు. బూట్లు నాకేందుకా ఆయన్ని రాజ్యసభకు పంపించింది? ఈ దళారీ పనులు ప్రజలకు తెలియవనుకుంటున్నావా? ఎవరి కాళ్ల మీద పడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారు? మీ రాజీనామా డ్రామాల విషయం ప్రజలకు తెలుసు. మా నేతలను కించ పరిచేలా మాట్లాడుతున్న జగన్ కు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతాం’ అని అన్నారు.
Jagan
devineni

More Telugu News