Chandrababu: తెలుగు వాడి సత్తా ఏంటో మా నాయకుడు మరోసారి రుజువు చేస్తారు : మంత్రి కొల్లు రవీంద్ర

షార్ట్స్‌లో చూడండి
జగన్ ని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా ప్రజలు చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రతిపక్ష నేత జగన్ కు అసెంబ్లీ అంటే ఏమాత్రం గౌరవం లేదు. అసెంబ్లీకి రాకుండా, ప్రజాసమస్యలపై చర్చించకుండా ఉండటం, ముఖ్యమంత్రిపై మీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని (జగన్) శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా ఉండేలా ఏపీ ప్రజలు చేస్తారు.

సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితికి రావడంతో కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది. టీఆర్ఎస్ ను అడ్టుపెట్టుకుని, అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని లోక్ సభను నిర్వహించకుండా చేసిన దౌర్భాగ్యపు స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు. మా నాయకుడు ఢిల్లీ వస్తున్నారు. 2,3 తారీకుల్లో ఢిల్లీ వస్తారు. ఏపీ ప్రయోజనాలను కాపాడే విధంగా పోరాటం చేస్తారు. అందరినీ ఐక్యం చేసి తెలుగు వాడి సత్తా ఏంటో మరోసారి రుజువు చేస్తారు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Go Back to Shorts
Chandrababu
Kollu Ravindra

More Telugu News