maruthi: ఆసక్తిని రేపుతోన్న 'భలే మంచి చౌక బేరమ్' మోషన్ టీజర్

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు మారుతి నిన్న ఒక ప్రకటన చేశాడు. న్యూ కాన్సెప్ట్ తో తమ టీమ్ చేస్తోన్న ఒక సినిమాకి సంబంధించిన టైటిల్  ను .. మోషన్ టీజర్ ను రేపు రిలీజ్ చేస్తామని చెప్పారు. అలా చెప్పినట్టుగానే ఆయన ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు మోషన్ టీజర్ ను వదిలాడు. ఇద్దరు స్నేహితులు 'కాన్ఫిడెన్షియల్' అనే కవర్ ను పట్టుకుని ఆందోళనతో కనిపిస్తున్నారు. అందులో అత్యంత కీలకమైన రహస్యం ఏదో దాగి ఉందనే విషయం సందర్భాన్ని బట్టి అర్థమవుతోంది.

 అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉండటం మరింత ఉత్కంఠను పెంచే అంశం. ఈ ఇద్దరి నేపథ్యంలో సరిహద్దుల్లో జరుగుతోన్న యుద్ధం చూపించడం, కుతూహలాన్ని పెంచే మరో అంశం. మారుతి అందించిన ఈ కాన్సెప్టు కి మురళీకృష్ణ దర్శకుడు. ప్రసాద్ ఆరోళ్ల .. గుడ్ సినిమా గ్రూప్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదులుతారనే విషయాన్ని కూడా ఈ మోషన్ పోస్టర్ ద్వారానే స్పష్టం చేశారు.   
Go Back to Shorts
maruthi
muralikrishna

More Telugu News