camaron ban craft: 'బాల్‌ టాంపరింగ్‌' ఆటగాడు బాన్ క్రాఫ్ట్ ప్రియురాలిపై వ్యంగ్యాస్త్రాలు

సౌతాఫ్రికాతో మ్యాచ్ లో బాల్‌ టాంపరింగ్‌ కు పాల్పడి కెమెరా కంటికి చిక్కిన కామెరూన్‌ బాన్‌ క్రాఫ్ట్‌ పై తీవ్రవిమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాన్ క్రాఫ్ట్ ప్రియురాలికి కూడా నెటిజన్ల విమర్శల తాకిడి పెరుగుతోంది. బాన్ క్రాఫ్ట్ పై కోపాన్ని అతని ప్రియురాలు కైట్లిన్ పై చూపిస్తూ, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.

నీ ప్రియుడు దేశానికి తలవంపులు తెచ్చాడు. మోసగాడు అంటూ కొందరు తిట్టిపోస్తుండగా, ఒక వ్యక్తి మరింత ముందుకు వెళ్లి... ‘మోసగాడికి ప్రియురాలిగా ఉండడం ఎలా ఉంది?’ అంటూ ప్రశ్నించాడు. మరొక నెటిజన్..గతంలో బాన్ క్రాఫ్ట్ తో అప్ లోడ్ చేసిన ఫోటోని డిలీట్ చేయ్యాలని సూచించాడు. ఈ వివాదంలో బాన్ క్రాఫ్ట్ శిక్ష అనుభవిస్తుండగా, వివాదానికి ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు కూడా విమర్శలు పాలు కావడంతో తలపట్టుకున్నారు. 
camaron ban craft
klaitin
Cricket
Twitter

More Telugu News