lalu prasad yadav: చికిత్స కోసం ఢిల్లీ చేరుకున్న లాలూ ప్రసాద్ యాదవ్!

  • ఎయిమ్స్ లో ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యుల సూచన
  • ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
  • నిన్న సాయంత్రం రైలులో బయల్దేరిన లాలూ
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత, దాణా కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగైన చికిత్స కోసం ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. వైద్యులు ఎయిమ్స్ లో ప్రత్యేక చికిత్స అవసరమని సూచించడంతో ఆయన్ను డిల్లీకి తరలించారు.

జార్ఖండ్ లోని బిస్రా ముండా జైల్లో ఉన్న లాలూ ఈ నెల 17న తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో సిబ్బంది ఆయన్ను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. మెరుగైన చికిత్స అవసరమని అక్కడి వైద్యులు సూచించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లేందుకు గాను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. దీంతో నిన్న సాయంత్రం రాంచి-న్యూఢిల్లీ రైలులో ఢిల్లీకి లాలూ బయల్దేరారు. విమానంలో ప్రయాణించేందుకు లాలూ ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో రైలులోనే వెళ్లాలని వైద్యులు సూచించారు.
lalu prasad yadav

More Telugu News