balakrishna: 'ఎన్టీఆర్' మూవీ ఓ తపస్సు .. అది బాలయ్య బాబు మాత్రమే చేయగలరు: రాజశేఖర్

  • ఎన్టీఆర్ ప్రేమానురాగాలను పొందాను 
  • ఆయనతో పరిచయం ఒక అదృష్టం 
  • ఆయన లక్షణాలు బాలయ్య బాబులో కనిపిస్తాయి    
బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కొంతసేపటి క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ వేడుకకి హాజరైన రాజశేఖర్ మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది చెన్నైలో .. ఎన్టీ రామారావుగారిని చూసే అదృష్టం  .. ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం నాకు కలిగాయి. ఆయన ప్రేమానురాగాలను పొందిన వ్యక్తులలో నేనూ ఒకడిని కావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఎన్టీఆర్ తో గల పరిచయం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. అలాంటి లెజెండ్ గురించి వచ్చే జనరేషన్ కి తెలియాలి. ఆయన బయోపిక్ చేసే అర్హత ఒక్క బాలకృష్ణ గారికి మాత్రమే వుంది. రూపంతో సహా ఎన్టీఆర్ గారి లక్షణాలన్నీ మనకి బాలయ్యబాబులో కనిపిస్తాయి. అందువలన ఈ సినిమా అనే తపస్సు చేయడం ఒక్క బాలయ్యబాబు వలన మాత్రమే అవుతుంది" అని చెప్పుకొచ్చారు.    
balakrishna
rajasekhar

More Telugu News