ప్రముఖ తమిళ హీరో మాజీ భార్య ఇంట్లో దొంగతనం!
- హీరో ప్రశాంత్ మాజీ భార్య ఇంట్లో చోరీ
- 170 తులాల బంగారం అపహరణ
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో, టీనగర్ లోని ఇంటి కిటికీని పగులగొట్టి ఉండటాన్ని ఇరుగుపొరుగు వారు బుధవారం ఉదయం గుర్తించారు. వెంటనే గృహలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో, వెంటనే తన సోదరిని అక్కడకు పంపించారామె. ఆమె లోపలకు వెళ్లి చూడగా... ఇంట్లో ఉంచిన 170 తులాల బంగారంతో పాటు, రూ. 10 వేలు చోరీకి గురైనట్టు గుర్తించారు. గృహలక్ష్మి ఫిర్యాదు మేరకు మాంబళం పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ప్రారంభించారు.