ప్రజలు మమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు: పరిణతి చోప్రా
- సినీ పరిశ్రమపై ప్రజల్లో ఎన్నో అపోహలు
- సినీ నటులను అపార్థం చేసుకుంటున్నారు
- సినిమా వారే అర్థం చేసుకోగలుగుతారు
సినీ నటులు పబ్లిక్ లో కనిపించిన ప్రతిసారి చాలా కళ్లు తీక్షణంగా గమనిస్తుంటాయని, దాంతోనే తాము చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని తెలిపింది. అలాగే తమ గురించి చాలా తొందరగా నిర్ణయానికి వచ్చేస్తారని చెప్పింది. అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటానని చెప్పింది. సినిమాల్లో నటించేవారు తప్ప తమ సమస్యలు వేరెవరూ అర్థం చేసుకోలేరని చెప్పింది. కామన్ పీపుల్ తో పోలిస్తే తమది చాలా డిమాండింగ్ లైఫ్ అని పరిణతి తెలిపింది.