మోదీ కాళ్లు మొక్కి విజయ సాయిరెడ్డి ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: పల్లె రఘునాథ రెడ్డి
- విజయ సాయిరెడ్డికి వెయ్యి మంది విజయ్ మాల్యాలు కూడా సమానం కారు
- విజయ సాయిరెడ్డి కన్నా మాల్యా ఎన్నో రెట్లు మేలు
- విజయ సాయిరెడ్డి ఆంధ్ర ప్రజల ఆస్తులను దోచుకున్నారు
ప్రత్యేక హోదా కోసం ఏపీలో పోరాటం జరుపుతుంటే మరోవైపు విజయసాయి రెడ్డి మాత్రం ప్రధాని మోదీ కాళ్ల మీద పడుతున్నారని, ఆయన మోదీ కాళ్లకు మొక్కి ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులు కొట్టేయాలని విజయసాయి రెడ్డి ఇలా ప్రయత్నాలు జరుపుతున్నారని, కేసుల నుంచి తమకు ఉపశమనం కలగాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు.