త్వరలో రూ.350 నాణేలు రాబోతున్నాయ్!
- 'శ్రీ గురు గోబింద్ సింగ్ జీ' 350వ జయంతి సందర్భంగా రూ.350 నాణేల విడుదల
- దీని బరువు 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల వరకు
- పరిమిత సంఖ్యలో ముద్రించవచ్చని అంచనా
అశోక స్తంభం లైన్ కేపిటల్ కింద '350' సంఖ్య ముద్రించి ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో దీని విశిష్టతలను వివరించింది. ఇక నాణేనికి వెనుక భాగాన 'తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహెబ్' బొమ్మ ఉంటుంది. పై భాగంలో '350వ ప్రకాశ్ ఉత్సవ్ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింగ్ జీ' అని దేవనాగరి లిపిలోనూ, దిగువ భాగంలో ఆంగ్లంలోనూ రాసి ఉంటుంది. ఎడమ, కుడి వైపు భాగాల్లో 1666-2016 సంవత్సరాలను ముద్రించి ఉంటారు. కాగా, ఈ నాణెం బరువు 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల వరకు ఉంటుంది. ఆర్బీఐ వీటిని పరిమిత సంఖ్యలో ముద్రించవచ్చని తెలుస్తోంది.