దర్శకుడు అజయ్ కౌండిన్యపై షీ టీమ్ కు ఫిర్యాదు చేయబోతున్నా: నటి శ్రీరెడ్డి

  • కౌండిన్య జైలుకు వెళ్లడం ఖాయం
  • డైరెక్టర్ పేరు తగిలించుకుని తిరిగే కౌండిన్య
  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన శ్రీరెడ్డి
ఇటీవలి కాలంలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ మీద బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి, దర్శకుడు అజయ్ కౌండిన్యపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "డైరెక్టర్ అని పేరు తగిలించుకుని ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా డైరెక్టర్ల అందరి పరువు తీసే అజయ్ కౌండిన్యా... నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. నోటికి దురదగొండాకు రాసుకుని తిరిగే నీ మీద తెలంగాణ షీ టీమ్ కు, ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నా. కొందరు యువకులు నా పేరు చెప్పుకుని పాప్యులర్ అవాలని భావిస్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్" అని వ్యాఖ్యానించింది.

 టాలీవుడ్ లో హీరోయిన్లను దర్శకులు, నిర్మాతలు వాడుకుంటారని, అవకాశాలు రావాలంటే తలొగ్గాల్సిందేనని, 99 శాతం మంది ఇదే బాపతువారు ఉన్నారని శ్రీరెడ్డి సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sri Reddy
Casting Couch
Tollywood
Ajay Koundinya

More Telugu News