Sivaji: చంద్రబాబు నన్ను కూడా పిలిచారు... కానీ వెళ్లడం లేదు: నటుడు శివాజీ

  • కొన్ని అనివార్య కారణాలతో వెళ్లడం లేదు
  • సమావేశం ఉంటుందని ముందుగా తెలియదు
  • సెల్ఫీ వీడియోలో నటుడు శివాజీ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాను ఏర్పాటు చేసిన అఖిలపక్ష, సంఘాల సమావేశానికి తనకు కూడా ఆహ్వానాన్ని పంపించారని నటుడు శివాజీ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలన్నింటికీ తన మద్దతు ఉంటుందని, అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ భేటీకి హాజరు కాబోవడం లేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసిన శివాజీ, ఈ సమావేశం ఉంటుందని తనకు తెలియదని చెప్పారు. ఈ సమావేశంలో అందరూ కలసి తీసుకునే ఏ ఏకగ్రీవ నిర్ణయానికైనా తన మద్దతు ఉంటుందని అన్నారు. తప్పులు చేస్తే వేలెత్తి చూపుతానని, హోదా కోసం పోరాడితే ప్రాణాలు అర్పించయినా, వారిని కాపాడుతానని స్పష్టం చేశారు.
Sivaji
Chandrababu
Special Category Status

More Telugu News