TTD: తిరుమలలో అపశ్రుతి... కిందపడిన అమ్మవారి విగ్రహం... రహస్యంగా శాంతి హోమం!

  • సోమవారం నాడు ఘటన
  • అర్చకుని వయోభారం కారణంగా చేజారిన విగ్రహం 
  • వివరణ ఇచ్చిన టీటీడీ అధికారులు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవ మూర్తులను తీసుకెళుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం అర్చకుని చేతుల నుంచి జారి కిందపడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం నాడు జరుగగా, విగ్రహం కింద పడిందన్న విషయాన్ని బయటకు రానీయకుండా, రహస్యంగా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఈ అపశ్రుతి గురించి సదరు దృశ్యాలను చూసిన భక్తులు బయట పెట్టడంతో, టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. వయోభారం కారణంగా అర్చకుడు విగ్రహాన్ని తెస్తున్న వేళ ఘటన జరిగిందని, విగ్రహం బరువుగా ఉండటంతోనే చేయి జారిందని తెలిపారు.
TTD
Tirumala
Tirupati

More Telugu News