మనమే థర్డ్ ఫ్రంట్ పెట్టేస్తే... పవన్ కల్యాణ్ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వని వామపక్షాలు!
- వామపక్షాలతో సమావేశమైన పవన్ కల్యాణ్
- తృతీయ కూటమిని ప్రారంభిద్దామని ప్రతిపాదన
- ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్య
దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని, ఇదే సమయంలో సరైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్, మూడో కూటమిని మనమే ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలసి నడుస్తున్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు, వెంటనే సమాధానం ఇవ్వలేదని సమాచారం.