Pawan Kalyan: ప్రశ్నించాల్సిన వాళ్లను పవన్ కల్యాణ్ వదిలేశారు : బీదా రవిచంద్ర యాదవ్

  • ఏపీ కోసం ఎవరితో కలిసి పోరాడాలో వాళ్లను పవన్ వదిలేశారు
  • టీడీపీపై ఆరోపణలు చేయడం సబబు కాదు
  • టీడీపీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూస్తోంది  
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ప్రశ్నలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నించడమే తన నైజమంటున్న పవన్ కల్యాణ్ అసలు ఎవరిని ప్రశ్నించాలో వాళ్లను వదిలేశాడని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకీ న్యాయం కోసం ఎవరితో కలిసి పోరాడాలో వాళ్లను వదిలేసి పలు రకాల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ అధినేత జగన్ పై పలు కేసులు ఉన్నాయని, అలాగే, టీడీపీపై ఏదో ఒక కేసు ఉందని చూపెట్టేందుకే బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూసినా తామేమీ భయపడమని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడుపై ఏం కేసులు పెడతారు? నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయనపై ఎన్నో కేసులు పెట్టారని, అయినప్పటికీ చంద్రబాబును ఏం చేయలేకపోయారని అన్నారు.  
Pawan Kalyan
Telugudesam
bida ravi chandra yadav

More Telugu News