Hyderabad: భార్య కళ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడిన భర్త

  • నాలుగు నెలల క్రితం లారీలో సామగ్రి లోడ్ చేస్తుండగా కిందపడిన శ్రీనివాసచారి
  • వెన్నెముకకు తీవ్రగాయం
  • ఇంటికే పరిమితం కావడం పట్ల మనోవేదన
భార్య కళ్లెదుటే మనోవేదనతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. బోయిన్‌ పల్లి పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్‌ బోయిన్‌ పల్లి, మైత్రీవన్‌ కాలనీలో లారీ డ్రైవర్ గా పని చేసే శ్రీనివాసచారి (50) భార్య ప్రభావతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం లారీలో సామగ్రి లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీపై నుంచి శ్రీనివాసచారి కిందపడ్డాడు. దీంతో అతని వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి.

 వైద్యుల సూచనతో శ్రీనివాసచారి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత, భార్య ప్రభావతితో వాకింగ్‌ చేసి వస్తానని చెప్పి తాము నివాసముండే బిల్డింగ్ మూడో అంతస్తుకు వెళ్లాడు. భార్య చూస్తుండగానే ‘ఇక నేను బ్రతకను’ అంటూ అరుస్తూ కిందకి దూకేశాడు. స్థానికుల సాయంతో శ్రీనివాసచారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Hyderabad
old bowenpalli
maitrvan colany

More Telugu News