ఇంగ్లిష్ లో మాట్లాడుతూ హేళన చేస్తున్నాడన్న కోపంతో.. స్నేహితుడిని హత్య చేసిన యువకుడు!
ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ చదువురాదని ఎగతాళి చేసే స్నేహితుడిని ఓ వ్యక్తి ఆగ్రహంతో హత్య చేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహిద్ రహీన్ (21), అలామ్ షేక్ మంచి స్నేహితులు. రహీన్ పెద్దగా చదువుకోకపోవడంతో షేక్ అతనితో ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లిష్ లోనే మాట్లాడేవాడు. దీనికి తోడు ఇంగ్లిష్ రాదని, పెద్దగా చదువుకోలేదని వేధించేవాడు.
దీంతో ఆత్మన్యూనతతో బాధపడిన రహీన్ షేక్ పై కసి పెంచుకుని, హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదను కోసం చూశాడు. అవకాశం రావడంతో నిన్న సాయంత్రం షేక్ ను బాంద్రాలోని నిర్మానుష్య ప్రాంతానికి రహీన్ తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం, షేక్ చేత ఎక్కువగా తాగించిన రహీన్, ఆ తర్వాత స్నేహితుడి గొంతు కోసి, ఆ కత్తితో 54 సార్లు పొడిచి చంపాడు. ఆ తరువాత సాహునగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. జరిగింది చెప్పి, పోలీసులను సంఘటనాస్థలికి తీసుకెళ్లాడు. దీంతో మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి, రహీన్ ను రిమాండ్ కు పంపించారు.