హైదరాబాద్లోని మాదాపూర్లో మంటల్లో కాలిపోయిన 150 గుడిసెలు
- సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికా నగర్లో ఘటన
- ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
- ఆ ప్రదేశంలో నివసిస్తోన్న నాలుగు రాష్ట్రాలకు చెందిన పేదలు
ఆ ప్రదేశంలో ఉంటున్నవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని తాము పనిచేస్తోన్న చోట్ల నుంచి బాధితులు తిరిగి వచ్చారు. గుడిసెల్లోని తమ వస్తువులు, సరుకులు అంతా కాలిపోయాయని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమాచారం అందాల్సి ఉంది.