పోలవరాన్ని ఆపేస్తున్నారు... సీబీఐ విచారణకూ ఆదేశాలు రానున్నాయి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బీజేపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కు
- తొలుత ఆరోపణలు చేయించి, ఆపై విచారణకు ఆదేశం
- తనకు తెలిసిపోయిందన్న చంద్రబాబు
నదుల అనుసంధానానికి కీలకమైన పట్టిసీమపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతోనే పోలవరం నిర్మిస్తున్నామని, రాష్ట్రం నిర్మిస్తే మరింత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావించిన మీదటే, నిర్మాణ బాధ్యతలను తాను నెత్తిన వేసుకున్నానని అన్నారు.