నితిన్ స్థానంలోకి నిఖిల్ .. అందుకు కారణం ఇదే!
- వెంకీ కుడుముల నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం
- నితిన్ కి బదులుగా నిఖిల్
- ఈ మార్పుకు కారణం బడ్జెట్
ఈ నేపథ్యంలో నితిన్ తో ఆయన సినిమా చేయనున్నాడనీ .. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నితిన్ కి బదులుగా నిఖిల్ కి ఛాన్స్ లభించిందనేది ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమాను పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చారట. నితిన్ తో అయితే తాము అనుకున్న బడ్జెట్ దాటిపోతుందనే ఉద్దేశంతో నిఖిల్ ను సెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.