ఇవాంకా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇంజన్లు ఫెయిల్

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు, ఆయన కుమార్తె కుటుంబం పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ కు ఇవాంకా ట్రంప్, భర్త జేడ్ కుష్నర్ తో కలిసి వెళ్తుండగా, హెలికాప్టర్ లోని రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించి, వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

అనంతరం ఆ దంపతులు అక్కడి నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. అయితే వారెందుకు హెలికాప్టర్ లో బయల్దేరారో వెల్లడించలేదు. హెలికాప్టర్ ఇంజన్లు ఫెయిలైన సమయంలో ఇవాంక దంపతులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పైలట్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
ivanka trump
jade kushnar
USA

More Telugu News