YSRCP: తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన వైసీపీ

  • రేపు ఎంపీలు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని విప్
  • నిన్న టీడీపీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ
  • ఇతర పార్టీల ఆందోళనలతో చర్చకు రాలేకపోతోన్న అవిశ్వాస తీర్మానం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు తమ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆ పార్టీ ఈ రోజు విప్ జారీ చేసింది. కాగా, మరోవైపు టీడీపీ కూడా తమ ఎంపీలకు నిన్న విప్ జారీ చేసి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిన విషయం విదితమే. దేశంలోని ఇతర పార్టీల ఆందోళనల కారణంగా టీడీపీ, వైసీపీ పార్లమెంటులో ప్రవేశపెడుతోన్న అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు వీలు కుదరడం లేదు. 
YSRCP
Telugudesam
no confidence motion

More Telugu News