sunil gavashar: గవాస్కర్ గారూ! మీకు డీసెన్సీ ఏది?: బంగ్లా అభిమానులు

  • చివరి బంతి వరకూ దోబూచులాడిన విజయం
  • ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో ఆనందానికి గురైన గవాస్కర్
  • నాగినీ స్టెప్పు వేసి ఆకట్టుకున్న గవాస్కర్
గవాస్కర్ గారూ! మీకు డీసెన్సీ ఏది? అంటూ బంగ్లాదేశ్ అభిమానులు టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు గవాస్కర్ ని ప్రశ్నిస్తున్నారు. నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌ లో దినేష్ కార్తిక్ మెరుపులతో బంగ్లాదేశ్‌ పై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు లీగ్ లలో విజయంతో బంగ్లాపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ దశలో కెప్టెన్ షకిబల్ హసన్ రాకతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న బంగ్లాదేశ్ చివరి బంతి వరకు పోరాట పటిమను చూపింది.

మోస్తరు స్కోరుతో టీమిండియాను ఓడించినంతపని చేసింది. ఈ దశలో చివరి బంతికి సిక్స్ కొట్టిన దినేష్ కార్తీక్ జట్టును విజయతీరాలకు చేర్చడంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న గవాస్కర్ నాగినీ స్టెప్పులేశాడు. దీనిని బంగ్లా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. దీనికి టీమిండియా అభిమానులు దీటుగా సమాధానం చెబుతున్నారు.
sunil gavashar
Cricket
team india

More Telugu News