దినేష్ కార్తీక్ కన్నా ముందు విజయ్ శంకర్ ను ఎందుకు పంపానంటే..: రోహిత్ శర్మ
- నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో 7వ స్థానంలో దినేష్ బ్యాటింగ్
- అతనికి అలవాటైన స్థానం అదే
- అందుకే విజయ్ ని ముందు పంపానన్న రోహిత్
ఇక విజయ్ శంకర్ ను ముందు పంపడంపై స్పందించిన రోహిత్ శర్మ, గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో 7వ స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడని, ముంబై ఇండియన్స్ టీమ్ లోనూ కార్తీక్ 7వ స్థానంలో ఆడేవాడని గుర్తు చేసిన రోహిత్, అతనికి అలవాటైన స్థానంలో పంపాలని అనుకున్నందునే శంకర్ ను ముందు పంపినట్టు చెప్పాడు. దినేష్ కార్తీక్ సత్తా తనకు తెలుసునని, చివరి రెండు ఓవర్లలో అధిక పరుగులు సాధించగలడన్న నమ్మకం కూడా తనకుందని వెల్లడించాడు. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించే సత్తా దినేష్ కుందని తాను గర్వంగా చెప్పగలనని అన్నాడు.