నా అభిప్రాయాలకు అడ్డు చెప్పకుండా ఉంటే...రాజకీయాల్లోకి వస్తా: కంగన రనౌత్
- రాజకీయ నాయకుల ఫ్యాషన్ నచ్చదు
- నా ఫ్యాషన్, మాటతీరు రాజకీయ నాయకులకు నచ్చవు
- రాజకీయాల గురించి తప్పుగా అనుకుంటారు
తనకు రాజకీయనాయకుల ఫ్యాషన్ సెన్స్ నచ్చదని తెలిపింది. తాను రాజకీయాల్లోకి రానున్నానంటూ వార్తలు వెలువడుతుంటాయని, తాను ధరించే దుస్తులు, తన మాట తీరు చూసి ఎవరూ తమ పార్టీలోకి తీసుకోరని చెప్పింది. తన ఫ్యాషన్, తన అభిప్రాయాలకు అడ్డు చెప్పకుండా ఉంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కంగనా తెలిపింది. మోదీ అంటే తనకు అభిమానమని పేర్కొన్న ఆమె, జీవితంలో ఆయన విజయం సాధించిన తీరు అద్భుతమని పేర్కొంది. ఒక ఛాయ్ వాలా ప్రధాని కాగలిగారంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనమని కంగనా అభిప్రాయపడింది.