జిమ్‌లో వెయిట్‌ లిఫ్ట్ చేస్తోన్న హృతిక్ రోషన్ తల్లి.. వీడియో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్‌లో వెయిట్‌ లిఫ్ట్ చేస్తోన్న హృతిక్ రోషన్ తల్లి.. వీడియో వైరల్

  • వీడియో పోస్ట్ చేసిన హృతిక్‌
  • తాను గర్వపడేలా చేసిందన్న బాలీవుడ్ హీరో
  • ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నానని వ్యాఖ్య
బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న తల్లి పింకీ రోషన్ (63) తో క‌లిసి జిమ్‌లో వ్యాయామం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హృతిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. పింకీ రోషన్ వెయిట్ లిఫ్ట్ చేస్తూ శ్రమిస్తోన్న తీరు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలో? మార్గదర్శకంగా తీసుకోవాలో? పోటీగా తీసుకోవాలో? తనకు అర్థం కావడం లేదని హృతిక్ పేర్కొన్నాడు.

తన తల్లి తనను గర్వపడేలా చేసిందని, ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపాడు. కాగా, హృతిక్ రోషన్ బాలీవుడ్ సినిమా ‘సూపర్‌ 30’లో నటిస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇటువంటి వీడియోలను ఆయన తరుచుగా పోస్ట్ చేస్తుంటాడు. 
hritik
mother
Gym

More Telugu News