amit shah: ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ

  • ఏ‌పీలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చ
  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబును కొనసాగించే అంశంపై భేటీ
  • టీడీపీ వైఖరిపై చర్చ 
  • తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో ఈ రోజు తమ పార్టీ ఏపీ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబును కొనసాగించే అంశంపై కూడా చర్చిస్తున్నారు. టీడీపీ తమతో మిత్రత్వాన్ని తెంచుకున్న తరువాత ఏపీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేక రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిన సాయం విషయాన్ని ప్రజలకు ఎలా వివరించి చెప్పాలన్న అంశంపై, ఏపీలో తమ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అమిత్ షా సూచనలు చేస్తున్నారు. టీడీపీ వైఖరిపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 
amit shah
BJP
Andhra Pradesh

More Telugu News